
విజయవంతంగా విద్యార్థుల సదస్సు
కొరుక్కుపేట: చైన్నె పట్టాభిరామ్‌లోని ధర్మమూర్తిరావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాల, తెలుగు శాఖ, తెలుగు భాషా సమితి తరఫున మంగళవారం ‘ఆధునిక తెలుగు కవులు వారి రచనలు‘ అనే అంశం పైన విద్యార్థులకు సదస్సు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌లో మహాకవి గురజాడ, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవిశేఖరుడు గుర్రం జాషువాల జయంతులను పురస్కరించుకుని ఈ సదస్సు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదే శాఖకు చెందిన పూర్వ శాఖాధ్యక్షులు డా. పి. సీతమ్మ పాల్గొని 16 మంది విద్యార్థుల పత్ర సమర్పణకు అధ్యక్షత వహించారు. అశ్విని, కిశోర్, మేఘకుమారిలకు చెందిన పత్రాలకు మొదటి, రెండు, మూడు స్థానాలతో సీతమ్మ జ్ఞాపికలనిచ్చి సత్కరించారు. తెలుగు శాఖాధ్యక్షుడు డా.సురేష్, అధ్యాపకులు డా జి. కల్విక్కరసి, కళాశాల సంచాలకుడు డా. ఎన్. రాజేంద్ర నాయుడు, డా. తుమ్మపూడి కల్పన పాల్గొన్నారు. అనంతరం సరస్వతీ పూజ నిర్వహించారు.