
●భార్య, ప్రియుడి సహా ముగ్గురి అరెస్ట్
దుర్గా అలంకారంలో
వాసవీ అమ్మవారు
కొరుక్కుపేట: అశ్వవాహనంపై దుర్గా అలంకారంలో శ్రీవాసవి అమ్మవారు భక్తులను కటాక్షించారు. 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 9వ రోజు మంగళవారం ఉదయం వేద పండితులు వేదపారాయణం, శ్రీకన్యకాపరమేశ్వరి మూలమంత్ర హోమం, అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ వాసవీ అమ్మవారిని అశ్వవాహనంలో దుర్గా అలంకారంలో కొలువుదీర్చి విన్నపాలు, దీపారాధన పూజలను చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శించుకుని తరించారు. జనని గణేష్ భరతనాట్య ప్రదర్శన, తెలుగు తరుణి మహిళా సభ్యులు, సహాన గ్రూప్‌ల భక్తిగీతాలాపన, పద్మలత వీణా వాయిద్య కచేరీలు వీణులవిందు చేసింది.
భర్త హత్య కేసులో..
కొరుక్కుపేట: సేలంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను భార్య హత్యచేసిన సంఘటన కలకలం రేపింది. దీంతో భార్య, ప్రియుడు ,సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లాలోని అడవికి 10 కి.మీ దూరంలో ఉన్న కీరై కాడులోని ఎర్కాడ్ గ్రామంలో నివసించే మోయా గౌంధర్ కుమారుడు శివకుమార్ (36) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు . 13 సంవత్సరాల క్రితం మారైని వివాహం చేసుకున్నారు. అతనికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్ ఆదివారం తన బైక్‌పై కుప్పనూర్‌లోని మార్కెట్‌కు వెళ్లి, ఇంటికి అవసరమైన కిరాణా సామాగ్రి, కూరగాయలు కొని, ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం రాత్రి శివకుమార్ తలకు తీవ్ర గాయంతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వైద్యులు, అటవీ అధికారులు, పోలీసుల దర్యాప్తులో నకిలీ నోట్లకు అడ్డుచెప్పాడని శివకుమార్‌ను హత్య చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు భార్య, ప్రియుడు , అతని స్నేహితులు అని ,దీంతో భార్య ,ప్రియుడితో సహా ముగ్గురుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.