
రాష్ట్రాభివృద్ధికి కోసం సంపూర్ణ మద్దతు
పరిశ్రమలశాఖ మంత్రి డాక్టర్ రాజా
కొరుక్కుపేట: రాష్ట్రాభివృద్ధికి కోసం వాణిజ్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టీఆర్‌బీ రాజా హామీ ఇచ్చారు. ఈ మేరకు హిందూస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (హెచ్‌సీసీ) 79వ వార్షిక సమావేశానికి మంత్రి శ్రీ డాక్టర్ టీఆర్‌బీ రాజా ముఖ్యఅతిథిగా హాజరై 80వ వార్షికోత్సవాన్ని, దాని లోగోను విడుదల చేసి ప్రారంభించారు. ఆయన తన ప్రసంగంలో ఇలాంటి చాంబర్ల ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. ప్రభుత్వంతో వాణిజ్యం, పరిశ్రమల ప్రయోజనం కోసం సహకార పరస్పర చర్య కోసం రాష్ట్రంలో హెచ్‌సీసీ ఏర్పడిందని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వాణిజ్య సంస్థలకు ప్రభుత్వం మద్దతును ఆయన హామీ ఇచ్చారు. హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 80వ అధ్యక్షుడిగా దుగర్ ఫైనాన్‌న్స్– ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, చైర్మన్ రమేష్ దుగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . 2025–26 సంవత్సరానికి హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 80వ అధ్యక్షుడిగా సేవలందిస్తారు. గౌరవ అతిథిగా ది సన్మార్ గ్రూప్ చైర్మన్, ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్‌శంకర్, టి. ప్రవీణ్‌కుమార్ తాటియా పాల్గొన్నారు.