
సీబీఐ విచారణకు పట్టు
కోర్టులో ఆదవ్ పిటిషన్
విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
పట్టినంబాక్కంలో మకాం
రాహుల్ ఫోన్‌కాల్
గురుమూర్తితో టీవీకే వర్గాల
సంప్రదింపు
విజయ్‌కు రాహుల్ ఫోన్‌కాల్
కరూర్ నుంచి రాగానే పనయూరు ఇంటికే విజయ్ పరిమితమయ్యారు. కాగా ఆ ఇంటి ని పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో భద్రతను పెంచారు. 34 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చారు. సోమవారం ఉదయాన్నే పనయూరు నివాసం నుంచి మకాంను నగరంలోని పట్టినంబాక్కం ఇంటికి విజయ్ మార్చేశారు. ఈ పరిస్థితులలో ఉదయాన్నే కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్‌తో మాట్లాడిన ఏఐసీసీ నేత, లోక్‌సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ విజయ్‌తో సైతం ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. 15 నిమిషాల పాటూ వీరు మాట్లాడుకున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. విజయ్ వద్ద వివరాలను సేకరించిన రాహుల్ ఓదార్చినట్టు చెబుతున్నారు. అదే సమయంలో ఉదయాన్నే ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రతినిధుల బృందం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతో కలిసి కరూర్‌కు వెళ్లింది.
సాక్షి, చైన్నె:కరూర్ ఘటనను సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుతూ తమిళగ వెట్రి కళగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున ఈ పిటిషన్ దాఖలైంది. కరూర్ ఘటనపై టీవీకే న్యాయవాద బృందం ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి దండపాణిని కలిసిన సమయంలో ఆయన ఇచ్చిన సూచనతో మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం ఆదవ్ అర్జున తరపున న్యాయవాదుల బృందం ఈ పిటిషన్ వేశారు. వేలు స్వామి పురంలో చోటు చేసుకున్న ఘటన ప్రమాదమా? పథకం ప్రకారం జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్‌లో వివరాలను పొందు పరిచారు. ప్రచారంలోకి రాళ్లు విసరడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం, విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. పోలీసులు భద్రతా వైఫల్యంను సైతం వివరిస్తూ, మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసును సీబీఐకు అప్పగించాలని విన్నవించారు. అలాగే విజయ్ కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రత కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం లేదా అక్టోబరు 3వ తేదీన విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పిటిషన్ దాఖలు తదుపరి ఆదవ్ అర్జున ఓ ప్రకటన విడుదల చేస్తూ, తనలోని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుటుంబంలోని వ్యక్తులు మరణించినంతగా గుండెవేదనతో ఉన్నట్టు పేర్కొన్నారు.
భారీగా నిరసనలు..
విజయ్‌కు వ్యతిరేకంగా ఓ వైపు పోస్టర్లు హల్‌చల్ చేస్తూ వస్తుంటే, మరోవైపు తిరుచ్చితోపాటూ పలు చోట్ల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. కరూర్ ఘటనకు ఆయన్న బాధ్యుడిగా చేరుస్తూ అరెస్టు చేయాలన్న నినాదంతో తెర మీదకు వచ్చింది. కొన్ని కుటుంబాలు అయితే, విజయ్ ప్రకటించిన ఆర్థిక సాయం తమకు వద్దని తిరస్కరించే విధంగా ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా కరూరల్‌లోని టీవీకే ముఖ్య నిర్వాహకులు కుటుంబాలతో సహా అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు విచారణ, అరెస్టు భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే విజయ్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి నేతలు పలువురు వైదొలగుతుండడం గమనార్హం. ఇక, విజయ్ తరపున ఇంత వరకు బాధితులను ఎవ్వరూ పరామర్శించక పోవడం విమర్శలకు దారి తీస్తున్నాయి. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్‌తో కలిసి నిలబడుదాం అని సీనీ వర్గాలకు దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్ పిలుపు ఇవ్వడం విశేషం. ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు పిల్లలను దయ చేసి వెంట బెట్టుకుని వెళ్ల వద్దంటూ నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఇక టీవీకే గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది సెల్వకుమార్ మధురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు.
ఆడిటర్ గురుమూర్తితో సంప్రదింపులు?
బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డ ఆడిటర్ గురు మూర్తితో టీవీకే వర్గాల సంప్రదింపు వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి గురుమూర్తి నివాసానికి టీవీకే ముఖ్యులు పలువురు వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన గురుమూర్తిని కలవడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. విజయ్ ఒకటి రెండురోజులలో ఆయన్ని కలిసే అవకాశాలు ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.

సీబీఐ విచారణకు పట్టు

సీబీఐ విచారణకు పట్టు