
శారదోత్సవ్ ప్రారంభం
సాక్షి, చైన్నె: ఎస్‌ఎంసీఏలో దేవీ నవరాత్రులలో భాగంగా శారదోత్సవ్ పేరిట 47వ వార్షికోత్సవ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి జరిగిన బ్రహ్మాండ పూజలతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఐదు రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాలలో శక్తి దేవత–దుర్గా మాత విగ్రహాలకు పూజలు, సాంస్కృతిక, కళా ప్రదర్శనలు, భక్తీ గీతాలపన కార్యక్రమాలు జరగనున్నాయి. ఎస్‌ఎంసీఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 వేల మందికి 3రోజులు ఆహారం పంపిణీకి చర్యలు తీసుకున్నారు. అలాగే విద్య, ఆరోగ్య సేవలకు చర్యలు తీసుకున్నారు. మణిపూర్ రిటైర్డ్ జస్టిస్ మురళీధరన్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ తొలి రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్వాహకులు కౌసిక్ గంగూలి, సందీప్, భాస్కర్, అనితా రమేష్ తదితరులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.