
బల్టీకి మంచి ఆదరణ
తమిళసినిమా: సినిమా ఇప్పుడు ఒక్క భాషలో రూపొందితే పెట్టిన పెట్టుబడి రాబట్టడం కష్టతరంగా మారింది. దీంతో మంచి కంటెంట్‌తో యూనిక్ కథాంశంతో చిత్రాలను రూపొందించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా తెరకెక్కిన చిత్రం బల్టీ. దీన్ని సంతోష్ సి.కురువిల్లా, బినూ జార్జ్ కలిసి నిర్మించారు. నూతన దర్శకుడు ఉన్ని శివలింగం కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ మలయాళం,తెలుగు భాషల్లో రూపొందింది. కబడ్డీ క్రీడను గ్యాంగ్ ముఠాలతో కలిపి తెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, శాంతను భాగ్యరాజ్, దర్శకుడు సెల్వరాఘవన్, నటి ప్రీతి అస్రాణి,అల్ఫోన్స్ పుత్రన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. వీథి కబడ్డీ క్రీడను ఆడే రెండు జట్టుల్లోని ఒక జట్టును డబ్బు ఆశ చూపి ఓ రౌడీ ముఠా నాయకుడు తన వైపునకు తిప్పుకుని, వారిని తన దౌర్జన్యాలకు ఎలా వాడుకున్నాడు? అతని ట్రాప్‌లో పడిన ఆ జట్టు ఎలాంటి పరిణాయాలను ఎదుర్కొన్నారు? చివరికి అతని బంధనాల నుంచి బయట పడగలిగారా? వంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన బల్టీ చిత్రాన్ని ప్రేక్షకుల ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర వర్గాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు సెల్వరాఘవన్ విలనిజం చిత్రానికి బలంగా మారిందనే చెప్పాలి. కాగా కథా, కథనాలు కొత్తగా ఉండటమే చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించడానికి ప్రధాన కారణం అంటున్నాయి చిత్ర వర్గాలు.
నటి మహిమా
నంబియార్