నటి మహిమా నంబియార్‌ హెచ్చరిక | - | Sakshi
Sakshi News home page

నటి మహిమా నంబియార్‌ హెచ్చరిక

Sep 30 2025 8:07 AM | Updated on Sep 30 2025 8:07 AM

నటి మహిమా నంబియార్‌ హెచ్చరిక

నటి మహిమా నంబియార్‌ హెచ్చరిక

తమిళసినిమా: గత 15 ఏళ్లగా కథానాయకిగా రాణిస్తున్న మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్‌. మాతృభాషలోనే కాకుండా తమిళంలోనూ పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్‌లో ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కథానాయకిగానే కాకుండి ప్రతి నాయకి పాత్రల్లోనూ మెప్పిస్తున్న మహిమా నంబియార్‌కు ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రం చేతిలో ఉన్నాయి. కాగా సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉండే ఆ బామ గ్రామరస్‌ పాత్రల్లో నటించడానికి వెనుకాడటం లేదు. దీంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానల్స్‌ ఈమెను పెద్దఎత్తున ట్రోల్‌ చేస్తున్నాయి. అదే ఇప్పుడు ఈమెకు కోపాన్ని రేకెత్తిస్తోంది. దీంతో మహిమా నంబియార్‌ యూట్యూబ్‌ ఛానల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. దీని గురించి ఈమె తన ఇన్‌స్ట్రాలో పేర్కొంటూ ఇటీవల కాలంలో తన గురించి కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయన్నారు. అలాంటి వదంతులను ఇప్పటి వరకూ సహిస్తూ వచ్చానని, ఇకపై సహించేది లేదని చట్టపరమైన చర్చలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇంత కాలం తన గురించి జరుగుతున్న వదంతులను శాంతంగా సహిస్తూ వచ్చానని, ఇకపై అలా ఉండనని, తాను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అదే విధంగా తన వ్యక్తగత విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. ఒక వేళ మీరు హద్దులు మీరితే కచ్చతం తనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్చలు తీసుకుంటాననీ, ఇదే తన చివరి హెచ్చరిక అని నటి మహిమా నంబియార్‌ పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూడు పదుల అమ్మడు అంతగా హర్ట్‌ అయిన ప్రచారం ఏమిటో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement