
ముగిసిన గ్రావిటాస్–25 సైన్స్ ఎగ్జిబిషన్
వేలూరు: ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తయారయ్యేందుకు ఉన్నత విద్య, పరిశోధనలు ముఖ్య పాత్ర వహిస్తుందని నీతి అయోగ్ డైరెక్టర్ సషాంస దెరి అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో మూడు రోజుల పాటూ జరిగే గ్రావిటాస్–25 ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వివిధ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటూ నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్నారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కర్ణాటక రాష్ట్రం హొసకోట ఎమ్మెల్యే, విద్యుత్‌శాఖ అభివృద్ధి చైర్మన్ శరత్‌కుమార్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ ఉపయోగించి లెదర్‌ను రాణిపేట జిల్లాలో తయారు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో 10 శాతం నష్టాలు,75 శాతం ఖర్చులతో ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యార్థులు వివిధ పరిశోధనలు చేయడం అభినందనీయమన్నారు. మరిన్ని పరిశోధనలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. వీఐటీ ఉపాద్యక్షులు శంకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రస్తుతం మొత్తం 13 వేల మంది విద్యార్థులు గ్రావిటాస్‌లో కలుసుకొని పలు పరిశోధనల ఎగ్జిభిషన్‌లను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఈ పరిశోధన పోటీల్లో గెలుపొందిన వారికి రూ: 30 లక్షలు విలువ చేసే బహుమతులను అందజేస్తున్నామన్నారు. అనంతరం వివిధ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్, కార్యనిర్వహన డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, విద్యార్థులతో పాటు ప్రొఫెసర్‌లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.