
ఆత్మాహుతికి మహిళ యత్నం
తిరువళ్లూరు: భర్త చనిపోయిన తరువాత తన ఆస్తు లు, బంగారు నగలను తన తమ్ముడు లాక్కుకుని ఇవ్వ డం లేదని పోలీసులకు పిర్యాదు చేసినా న్యాయం చేయకపోవడంతో ఆగ్రహించిన మహిళ సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహుతికి యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళను అడ్డుకున్న పోలీసులు ఆమెను తిరువళ్లూరు టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా పెద్దకుప్పం ఎంజీఆర్ నగర్‌కు చెందిన మీన(40) భర్త గత పది సంవత్సరాల క్రితం చనిపోయాడు. దీంతో తనకు అత్తింటి నుంచి వచ్చిన ఆస్తి, బంగారు నగలను మీనా తన తమ్ముడు పుష్పరాజ్ దగ్గర ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తాను ఇచ్చిన బంగారు నగలు, ఆస్తులను తన పేరుపై మార్చాలని మీన కోరగా అందుకు పుష్పరాజ్ నిరాకరించడంతో పాటు బెదిరింపులకు దిగాడు. తన పై బెదిరింపులకు దిగుతున్న తమ్ముడిపై చర్యలు తీసుకోవడంతోపాటు బంగారు నగలు, ఆస్తులను తిరిగి ఇప్పించాలని టౌన్ పోలీసులకు బాధి త మహిళ ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ గట్టిగా నినాదాలు చేస్తూ సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహుతికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళను అడ్డుకుని ఆమేపై నీరు పోసి, స్టేషన్‌కు విచారణ నిమిత్తం తరలించారు.