
మిల్లర్లు నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ హరిత
సిరిసిల్ల: జిల్లాలోని రైస్‌మిల్లర్లు నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎం.హరిత కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలో వరి ధాన్యం సేకరణ, బ్యాంక్ గ్యారెంటీ, సీఎమ్మార్ సరఫరాపై రైస్‌మిల్లర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైస్‌మిల్లర్లు సీఎమ్మార్ సరఫరా చేయాలని, గత ఖరీఫ్‌లో జిల్లాలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఈనెల మూడో వారంలో జిల్లాలో వరికోతలు మొదలు కానున్నాయని, ఈ సీజన్‌లో దాదాపు 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అంచనా ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం రైస్‌మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైస్‌మిల్లర్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌సీఐకి బియ్యం ఇచ్చేందుకు బెడ్స్ ఇప్పించాలని విన్నవించగా.. నిబంధవల ప్రకారం మిల్లర్లకు సహకరిస్తామని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డీఎం రజిత, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.
గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ అభివృద్ధిపై కాన్ఫరెన్స్
గ్రీన్‌ఫీల్డ్ నాగ్‌పూర్–హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్ అభివృద్ధిపై రోడ్డు భవనాల శాఖ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు డీపీఆర్‌కు సహకరించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎం.హరిత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.