
నేతకార్మికులకు యారన్ సబ్సిడీ ఇవ్వండి
సిరిసిల్లటౌన్: ఇందిరా మహిళాశక్తి చీరలకు సంబంధించిన పవర్‌లూమ్స్, అనుబంధ రంగాల కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని పవర్‌లూమ్స్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలో సోమవారం పర్యటించిన చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. మొదటి విడత ఆర్డర్ పూర్తికావస్తున్నందున కార్మికుల ఉపాధికి ఇబ్బంది కలగకుండా రెండో విడత ఆర్డర్‌ను అందించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, అక్తర్ అన్సారి పాల్గొన్నారు.