తెలుగు తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం | - | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం

Oct 9 2025 2:55 AM | Updated on Oct 9 2025 2:55 AM

తెలుగు తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం

తెలుగు తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం

తెలుగు తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం

టీడీపీలో వర్గపోరు బహిర్గతం టీడీపీ నాయకుడు శాఖమూరి శ్రీనివాసరావుపై కార్యకర్తల దాడి తీవ్ర గాయాలతో గుంటూరు వైద్యశాలలో చేరిక ఇసుకలో వాటాలు కుదరకనే దాడులు జరిగినట్లు సమాచారం

నర్సరావుపేట: టీడీపీలో వర్గపోరు బహిర్గతమైంది. ఇసుకలో వాటాలు కుదరక దాడులు చేసుకున్నట్లు సమాచారం. అచ్చంపేట మండలంలోని కోనూరుకు చెందిన టీడీపీ నాయకుడు శాఖమూరి శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయానికి పని నిమిత్తం కారులో వచ్చారు. తిరిగి వెళుతుండగా చిగురుపాడు దాటిన తరువాత కొందరు మాస్క్‌లు ధరించి అడ్డంగా నిలబడి ఆపారు. కిందకు దింపి కర్రలతో, ఇనుపరాడ్లతో తీవ్రంగా గాయపరచినట్లు సమాచారం. అయితే ఎవరు కొట్టారు.. ఎందుకు కొట్టారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. శాఖమూరి శ్రీనివాసరావును బంధువులు అదే కారులో గుంటూకు తీసుకెళ్లి, అక్కడే అనుమానితులపై కేసు పెట్టి, ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసరావుకు కుడికాలుకు తీవ్రంగా గాయమై, శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. కొందరు కోనూరు గ్రామస్తులు, సమీప బంధువులు తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో కోనూరులో ఇసుక ర్యాంపులు నిర్వహణలో శాఖమూరి శ్రీనివాసరావు నిర్వాహకులను బెదిరించినట్లు సమాచారం.

వాటా ఇవ్వాలని పట్టు

పార్టీ అధికారంలోకి రావడం కోసం తీవ్రంగా కష్టపడ్డానని, తనకు వాటా ఇవ్వాలని, లేకపోతే ఇసుక ర్యాంపును నడపనీయనని శ్రీనివాసరావు కరాఖండిగా చెప్పాడు. అయినా ఇవ్వకపోవడంతో ర్యాంపు నిర్వహకులపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. నదికి అడ్డంగా వేసిన రోడ్లను తీయించే వరకు పిటీషన్లపై పిటీషన్లు పెట్టాడు. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి ఇసుక ర్యాంపును మూసి వేశారు. దానివల్ల కొద్దిరోజులు మాత్రమే ఇసుక రవాణాను ఆపగలిగిన శ్రీనివాసరావు తిరిగి ర్యాంపు మొదలుకావడంతో కార్యకలాపాలకు మరింత పదును పెట్టాడు. తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యే స్థాయి కంటే ఇంకా పెద్ద పోస్టులో ఉన్న వారిని ఆశ్రయించి తిరిగి ఇసుక ర్యాంపును నిలిపి వేయించాడు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులకు, శ్రీనివాసరావుకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. టీడీపీ అగ్రనాయకులు కొందరు శ్రీనివాసరావును బుజ్జగించే ప్రయత్నం చేసి, కొంతమొత్తం ముట్టచెప్పేందుకు ప్రలోభపెట్టినా వినలేదు. తాను కోరిన విధంగా వాటా కావాలంటూ భీష్మించుకుని కూర్చువడమే దాడికి కారణంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి కోనూరు ఇసుక రీచ్‌ నుంచి రవాణా జరగకపోయినా, ముందస్తులో భాగంగానే తహసీల్దారును కలిసేందుకు వచ్చిన శ్రీనివాసరావుపై దాడి జరగడం వెనుక టీడిపీ వారే కుట్రకు పాల్పడినట్లు ప్రజలు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement