
ప్రతిరోజు 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి
బెంగళూరు దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు సుమారు 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో మళ్లీ నగరంలో వాహనాల సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే నత్తనడక సంచార రద్దీ కలిగిన నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. నగరవాసులు తమ ప్రయాణ సమయంలో సగానికి పైగా సమయం ట్రాఫిక్ సిగ్నల్స్‌తో వాహనాల రద్దీలో కోల్పోతున్నారు. దీంతో పాటు నగరవాసులు ఏడాదికి 260 గంటలు రోడ్లలోనే గడిపే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తక్కువ ధరకు ఢిల్లీలో లభించే వేలాది వాహనాలు బెంగళూరు రోడ్లపైకి వస్తే ఇక్కడ పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోంది.