
నడకతో మేలు
నేను ఉద్యోగ విరమణ పొంది ఐదేళ్లవుతంది. రోజూ 30 నిమిషా లపాటు నడుస్త. మరో 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్త. చాలాఆరోగ్యంగా ఉంటున్నా. ప్రాంతాలు వేరైనా అందరం కలిసి ప్లాంట్‌లో పనిచేశాం. ఒకేప్రాంతంలో ఉంటున్నాం. మాకు మేమే స్నేహితులం.
– కొమ్ము గోపాల్
ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఇంతకుముందు విద్యుత్ ఉత్పత్తిలో అందరం కలిసి పనిచేసేవాళ్లం. ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్‌లో కలుస్తూ అందరం కలిసిమెలసి ఉంటున్నాం. బాధలు, సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా ఉంటున్నాం. – పురుషోత్తం
నాలుగేళ్ల క్రితం రిటైర్డ్ అయిన. ఉద్యోగం చేసే సమయంలో కొందరం మిత్రులం కలిసి కృష్ణానగర్‌లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నాం. నాకు యోగా అంటే చాలాఇష్టం. నేను సాధన చేస్తూనే మిత్రులకు నేర్పిస్తున్నా.
– రాజయ్య