
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: అనధికారికంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎంఎస్‌ఓ గొలుగూరి బాపిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారంతో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా, వ్యాన్ ద్వారా గోనె సంచుల్లో తరలిస్తున్న 13,750 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. దీని విలువ రూ.12 లక్షలు ఉంటుంది. పట్టుబడిన బియ్యానికి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ కోరసిక విజయ్, సరకు రవాణాదారు, వాహన యజమాని అయిన గొల్లప్రోలుకు చెందిన గారపాటి రాజుపై 6ఏ కేసు నమోదు చేశారు. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.