● ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
● అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం
రాజానగరం: ఒక్క క్షణం.. ఇంటి వద్ద ఓ కుటుంబం ఎదురుచూస్తుందని ఒక్క క్షణం ఆలోచిస్తే.. ఎంతో జీవితం మిగిలి ఉందన్న ఆలోచన ఒక్క క్షణమైనా వస్తే.. నిర్లక్ష్యపు ప్రయాణం, ప్రమాదకరమైన అతివే గం అనేవి ఉండవు. ఆ నిర్లక్ష్యం.. అతివేగం కారణంగానే రెండు నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మండలంలోని నందరాడ–నరేంద్రపురం మధ్య ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో, వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం, జట్టు కూలీగా పని చేసే రాజానగరానికి చెందిన బుదిరెడ్డి సత్యనారాయణ (30) మంగళవారం సాయంత్రం కో రుకొండ నుంచి స్కూటీపై వస్తున్నాడు. అదే సమయంలో కొవ్వూరుకు చెందిన మోర్ల శ్రీనివాసరావు (45) కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలోని అత్తవారింటికి వేరే మోటార్ బైక్‌పై వెళ్తున్నాడు. కాగితాలమ్మవారి గుడి సమీపంలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో గాయపడిన ఇద్ద రు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కాగా శ్రీనివాసరావు వివరాలు తెలియాల్సి ఉంది. రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తీరని నష్టం : అతివేగం అనర్థదాయకమంటూ అనేక విధాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ వేగ నియంత్రణపై జనాలు దృష్టి పెట్టడం లేదు. నందరాడలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ధ్వంసమైన తీరు చూస్తుంటే.. వీరు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారో అవగతమవుతోంది. ఆ వేగమే వారి ప్రాణాల నూ హరించి, వారి కుటుంబాలకు తీరని నష్టాన్ని చేకూర్చింది.
అతివేగం.. తీసింది ప్రాణం
అతివేగం.. తీసింది ప్రాణం
అతివేగం.. తీసింది ప్రాణం