
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను ఐపీఈ (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) సలీమ్ బాషా ప్రారంభించారు. బేస్‌బాల్, హాకీ, స్విమ్మింగ్‌లో అండర్–14, 17 బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బేస్‌బాల్‌లో 64, హాకీలో 72, స్విమ్మింగ్‌లో 76 మంది ఎంపికై నట్టు ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులు శ్రీనివాస్, సుధారాణి తెలిపారు. పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలను పర్యవేక్షించారు.
బేస్‌బాల్ పోటీలు ఎంపికై న కొవ్వూరు
పాఠశాల క్రీడా సమాఖ్య ఽఆధ్వర్యంలో కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో నిర్వహించిన అండర్–14, 17 బేస్‌బాల్ ఎంపికల్లో కొవ్పూరు జెడ్పీ పాఠశాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో సోము దీక్షితారాణి, మాసాబత్తుల సూర్యహాసిని, బాలుర విభాగంలో మడుగుల తేజ, అనసూరి రోహిత్, వెంకట్‌గణేష్, అండర్–17లో విత్తనాల రాజా శ్రీవల్లి, వీధిసత్యశాంతి, సోము హారిక, బాలుర విభాగంలో రెడ్డిసత్య వెంకట్రావు, పిల్లి అభిరామ్ ఎంపికై నట్టు పాఠశాల హెచ్‌ఎం బండిసత్య శ్రీనివాస్, పీడీ ప్రసాద్ తెలిపారు.