ఏరులై పారుతున్న నకిలీ మద్యం
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో కోట్లాది రూపాయల విలువైన నకిలీ మద్యం రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారుతోందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. ప్రభుత్వం, ఎకై ్సజ్ శాఖ పర్వవేక్షణా లోపం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా నకిలీ మద్యం గ్రామాలకూ విస్తరించిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడిన నేపథ్యంలో, దీని మూలాలు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఉన్నట్టు అధికారులు గుర్తించి, నకిలీ మద్యం బాటిళ్లు, తయారీ యంత్రాలు, ఖాళీ సీసాలు, ప్యాకింగ్ సామగ్రి పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ నకిలీ మద్యాన్ని బహిరంగ మార్కెట్లో ప్రజలతో తాగిస్తున్నారన్నారు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మరణించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధనదాహంతో కూటమి నేతలు నకిలీ మద్యాన్ని విక్రయించి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. అల్లవరం మండలం కొమ రగిరిపట్నంలో రెండు నెలల క్రితం నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించారని తెలిపారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బెల్ట్ షాపుల నుంచి ఎకై ్సజ్ శాఖకు మాముళ్లు అందుతున్నాయని ఆరోపించారు. తక్షణమే బెల్ట్ షాపుల నిర్వాహకులు, నకిలీ మద్యం తయారీదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.


