
అవకాశాలు లేకుంటే పస్తులే
30 ఏళ్ల నుంచి రంగస్థల నాటక రంగంలో నటులకు అలంకరణ, డ్రెస్‌లు, సామగ్రి సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వేషాల సామగ్రి స్థానికంగా తయారు చేయడంతో పాటు చైన్నె వంటి నగరాల నుంచి కొన్ని తీసుకు వస్తాం. నాతో పాటు మరో ఐదుగురు పని చేస్తారు. గతంలో మాదిరిగా ఇప్పుడు అవకాశాలు లేవు. వేరే వృత్తిలోకి వెళ్లలేక అవకాశాలు ఉన్నప్పుడు తింటున్నాం. లేకుంటే పస్తులుంటున్నాం.
– తూము రమేష్, మేకప్ ఆర్టిస్ట్,
డ్రామా డ్రెస్ కంపెనీ,
రాజమహేంద్రవరం