
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేద్దాం
రావులపాలెం: వైఎస్సార్ సీపీ బలోపేతానికి సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నుంచి సీఈసీ (సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) మెంబర్‌గా మాజీ ఎంపీ చింతా అనురాధ, ఎస్‌ఈసీ (స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) మెంబర్లుగా సాకా మణికుమారి, కుడుపూడి భరత్‌లు నియమితులయ్యారు. ఈ సభ్యులు రావులపాలెం మండలం గోపాలపురంలో జగ్గిరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జగ్గిరెడ్డి వారిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.

వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేద్దాం