
● ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే మనుగడ
నేను కురుక్షేత్రం నాటకంలో పలు పాత్రలు పోషిస్తాను. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. ఉత్సవ కమిటీలతో పాటు ప్రభుత్వం పౌరాణిక రంగస్థల నాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తేనే మాలాంటి చిన్న నటులు మనుగడ సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. అక్కడ ఏటా వివిధ ఉత్సవాల్లో నాటక ప్రదర్శనలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– అన్నందేవుల నారాయణరావు,
రంగస్థల కళాకారుడు, కేశవరం,
మండపేట మండలం