
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా, అనుబంధ విభాగాల కమిటీ సభ్యులుగా జిల్లా నుంచి పలువురికి అవకాశం దక్కింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రాజోలుకు చెందిన రుద్రరాజు వెంకట నరసింహ శ్రీపద్మరాజు, పి.గన్నవరానికి చెందిన వాసంశెట్టి వీరవెంకట తాతారావు(తాతాజీ)ని నియమించారు. స్టేట్ గ్రీవెన్స్‌సెల్ సెక్రటరీగా వనుము సత్యకల్యాణి (కొత్తపేట), జాయింట్ సెక్రటరీగా మానే శ్రీను(అమలాపురం), వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మట్టపర్తి మీరాసాహెబ్‌శెట్టి(పి.గన్నవరం), ఇళ్ల గోపి (అమలాపురం), కాకిలేటి శ్రీనివాస్(పి.గన్నవరం), స్టేట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీగా దొమ్మేటి వెంకటరావు(కొత్తపేట), కుడుపూడి సత్యనారాయణ(అమలాపురం), ఆర్‌టీఐ వింగ్ రాష్ట్ర సెక్రటరీగా కోనాల రాజు(కొత్తపేట), జాయింట్ సెక్రటరీలుగా ఏడిద సూరిబాబు (ముమ్మిడివరం), సుంకర సుధ(అమలాపురం)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.