
7న మినీ ఉద్యోగ మేళా
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన మినీ ఉద్యోగ మేళా జరుగుతుందని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ తెలిపారు. బెంగళూరులోని ఫాక్సకన్ కంపెనీ, పహార్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీకి సంబంధించి ఇంటర్వ్యూలు ఏడున ఉదయం పది గంటలకు జరుగుతాయన్నారు. జిల్లాలోని 30 ఏళ్లలోపు సీ్త్ర, పురుష అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ చెప్పారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికై న వారికి నియామక పత్రాలు ఇస్తారని తెలిపారు.