
శంకరగుప్తంపై రీ ఎస్టిమేషన్
మలికిపురం: రాజోలు దీవిలో రైతుల పాలిట దు:ఖ: దాయనిగా మారిన శంకరగుప్తం మేజర్ డ్రైన్ అభివృద్ధిపై తక్షణమే రీ ఎస్టిమేషన్ వేయాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డ్రైన్ ముంపు, చనిపోయిన లక్షలాది కొబ్బరి చెట్లు, రైతుల దుస్థితిపై ఇటీవల శ్రీసాక్షిశ్రీలో వరుస కథనాలు ప్రచురణ అయ్యాయి. స్పందించిన ప్రభుత్వం రంగంలోంకి దిగింది. డ్రైన్ మరమ్మతులకు ఇప్పటికే అంచనా వేసిన రూ.17 కోట్లు సరిపోవనే అంశాలన్ని కూడా సాక్షి పత్రిక ప్రస్తావించింది. గురువారం మంత్రి నిమ్మల రాజోలు నియోజక వర్గం కేశనపల్లిలో శంకరగుప్తం డ్రైన్ ముంపు వల్ల చనిపోయిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 24 కిలోమీటర్ల పొడవు గల ఈ డ్రైన్‌లో డ్రైడ్జింగ్‌తో పాటు పటిష్టంగా ఏటి గట్ల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉందన్నారు. రీ ఎస్టీమేట్ వేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్, ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

శంకరగుప్తంపై రీ ఎస్టిమేషన్