
పోలీసుల ఆయుధ పూజ
అమలాపురం టౌన్: విజయ దశమి సందర్భంగా అమలాపురంలోని జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వుడు (ఏఆర్) కార్యాలయంలో ఎీస్పీ రాహుల్ మీనా ఆయుధ పూజ చేశారు. జిల్లాలో పోలీసులు వినియోగించే తుపాకులు, తదితర ఆయుధాలకు, పోలీస్ వాహనాలకు ఎస్పీ మీనా గురువారం శాస్త్రోక్తంగా పూజలు చేసి విజయదుర్గను కొలిచారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసులకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. పురోహిత బ్రహ్మ ఉపద్రష్ట విజయాదిత్య సోదరులు ఎస్పీతో ఆయుధ పూజ చేయించారు. దుర్గాదేవి చిత్రపటం వద్ద ఉంచిన ఆయుధాలకు ఎస్పీ పూజలు చేశారు. విజయాలకు చిహ్నమైన విజయ దశమి అందరికీ విజయం చేకూర్చాలని, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎస్పీ మీనా ఆకాంక్షించారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఏఆర్ ఆర్‌ఐ కోటేశ్వరావు, పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, స్పెషల్ బ్రాంచి సీఐ పుల్లారావుతో పాటు ఎస్పీ, ఏఆర్ కార్యాలయాల పోలీస్ సిబ్బంది పొల్గొన్నారు.
మహాత్మాగాంధీకి నివాళి
జాతి పిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సెల్యూట్ చేశారు.