
పగబట్టి పోటెత్తినట్టు
సాక్షి, అమలాపురం: గోదావరి వరద కష్టాలు వీడడం లేదు. జూలైలో మొదలైన వరద అక్టోబరు వచ్చినా కొనసాగుతోంది. ఈ ఏడాది భారీ వరద లేకున్నా ఒకసారి రెండో ప్రమాద హెచ్చరిక.. మరో నాలుగు సార్లు తొలి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. వరద వచ్చిన ప్రతిసారి గోదావరి నదీపాయల మధ్య ఉన్న లంకవాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. గోదావరి మరోసారి పోటెత్తింది. జిల్లాలోని లంక గ్రామాలను వరద చుట్టు ముడుతోంది. 48 గంటల్లో వరద ఉధృతి భారీగా పెరిగింది. సోమవారం రాత్రి ఆరు గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువునకు 9,59,784 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ఇది బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ==== క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
వరదలకు మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై రాకపోకలు నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు నిలిచిపోయాయి. మామిడికుదురు నుంచి ఉచ్చులవారిపేట మీదుగా కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. పి.గన్నవరం, అయినవిల్లి, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లో వరద ముంపు కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాన్నేల్లంక, గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ గేదెల్లంక, చింతపల్లిలంకల్లోని లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరింది. స్థానికులు మోకాలు లోతు నీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం మత్స్యకారకాలనీ నీట మునిగింది. ఇళ్ల మధ్యకు నీరు చేరడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం కాజ్‌వే నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది.
రైతులకు అంతులేని నష్టం
గోదావరికి ఐదుసార్లు తాకిన వరద లంక గ్రామాల్లోని ఉద్యాన రైతుల వెన్ను విరిచింది. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 29 గ్రామాల్లో 2,674 మంది రైతులకు చెందిన 2,216.82 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.2.4 కోట్లు ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినవిల్లి, కపిలేశ్వరపురం మండలాల్లో కూరగాయ పంటలు, పశుగ్రాసాలు అధికంగా నష్టం వాటిల్లింది.
● మామిడికుదురు, ఐ.పోలవరం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వెనామీకి నష్టం వాటిల్లింది. వరదలకు భయపడి కౌంట్‌కు వస్తున్న రొయ్యలను మధ్యలో పట్టుబడులు చేయాల్సి వచ్చింది.
నిలిచిన రేవు ప్రయాణాలతో కష్టాలు
జిల్లాలో కోటిపల్లి–ముక్తేశ్వరం, సఖినేటిపల్లి–నర్సాపురం, జి.మూలపొలం–పల్లంకుర్రు, సోంపల్లి–అయోధ్యలంక, చాకలిపాలెం–దొడ్డపట్ల రేవుల్లో ప్రయాణాలు నిలిపివేశారు. పంటులు, పడవల మీద రాకపోలు నిలిపివేయడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి, రామచంద్రపురం వెళ్లేవారు ఎక్కువ. పంటు దాటితే రామచంద్రపురం 17 కిలో మీటర్ల దూరం, అటువంటిది ఇప్పుడు 60 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. సఖినేటిపల్లి నుంచి నర్సాపురం రేవు మీదుగా 9 కిలో మీటర్లు కాగా, ఇప్పుడు 25 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తోంది.
లంకాఫ్ ఠాన్నేల్లంక మత్స్యకార కాలనీలో జ్వరంతో ఇబ్బంది పడుతున్న మహిళను ఎత్తుకుని తీసుకువస్తున్న స్థానికుడు
సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక
నుంచి టేకిశెట్టిపాలెం వెళ్లే రహదారిపై వరద నీరు
పడలవ మీదనే ప్రయాణం
పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలంక, అరిగెలవారిపాలెం, బూరుగులంక, ఊడిమూడిలంక గ్రామ వాసుల వరద కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది జులై చివరి వారంలో వరద మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 3,500 మందికి పైగా జీవిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు అనారోగ్యం బారిన పడినవారు ఎవరైనా సరే పడవ మీదే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు, పశుగ్రాసాలు, రోజువారి పాల విక్రయాలు ఇలా సర్వం పడవల మీదనే తరలించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. పి.గన్నవరం మండలాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయిలంక, అనగారిలంక, శిర్రవారిలంక, అయోధ్యలంక, పుచ్చలంక వాసులు, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక వాసులు కాజ్‌వేలు మునిగిన ప్రతిసారి పడవలను ఆశ్రయించాల్సి రావడంతో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు.
కోనసీమ లంకల్లో వీడని వరద
ముంపులో నానుతున్న గ్రామలు
ఆ నాలుగు గ్రామాలకు
మూడు నెలలుగా ఇదే పరిస్థితి
మునుగుతున్న కాజ్ వేలు.. రోడ్లు
ప్రయాణాలన్నీ పడవల పైనే
పలుచోట్ల ఆగిన రేవు ప్రయాణాలు
ఉద్యాన పంటలు.. పశుగ్రాసాలు..
వెనామీ రొయ్యలకు నష్టం

పగబట్టి పోటెత్తినట్టు

పగబట్టి పోటెత్తినట్టు

పగబట్టి పోటెత్తినట్టు

పగబట్టి పోటెత్తినట్టు

పగబట్టి పోటెత్తినట్టు