
శ్రీ దుర్గాదేవిగా అమ్మవార్ల దర్శనం
అమలాపురం టౌన్: శరన్నవ రాత్ర మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లు దుర్గాదేవిగా అలంకృతమై భక్తులకు దర్శనిమిచ్చారు. స్థానిక శ్రీదేవి ఆలయం, కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం, వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలోని వైష్ణవీ కనకదుర్గ ఆలయం, హౌసింగ్ బోర్డు కాలనీలోని కల్యాణ దుర్గ ఆలయం, గోల్డ్ మార్కెట్‌లోని శ్రీకామాక్షీ ఏకాంబరేశ్వరీదేవి ఆలయాల్లో అమ్మవార్లు శ్రీదుర్గా దేవిగా అలంకృతమై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో కుంకుమ పూజలు, హోమాలు వైభవంగా సాగాయి.
కాజేసిన మొత్తం
రూ.95 లక్షలు
కరప: కూరాడలో వేళంగి ఎస్‌బీఐ బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ) చిన్నం ప్రియభారతి మొత్తం రూ.95 లక్షల మేర మహిళాశక్తి సంఘాల సొమ్మును కాజేసినట్లు నిర్ధారణ అయ్యిందని వెలుగు ఏపీఎం ఎంఎస్‌బీ దేవి మంగళవారం రాత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 66 గ్రూపుల సభ్యులు బాధితులుగా ఉన్నారని చెప్పారు. కూరాడ గ్రామస్తులతో కలసి ఏపీఎం సోమవారం 39 గ్రూపులను తనిఖీ చేయగా బీసీ రూ.52 లక్షలు కాజేసిందని గుర్తించారు. మిగిలిన గ్రూపుల అకౌంట్లను మంగళవారం ఏపీఎం తనిఖీ చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలున్నాయి. వీటిలో 40 గ్రూపుల వారు వేళంగిలోని యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్రాంచిల్లో తాము తీసుకున్న రుణాల సొమ్ము జమ చేశారు. అక్కడకు వెళ్లలేని మిగిలిన 66 గ్రూపుల వారు కూరాడలోని ఎస్‌బీఐ బీసీ పాయింట్‌లో సొమ్ము చెల్లించేవారు. ఈ బీసీ పాయింట్‌ను ఆ గ్రామానికి చెందిన చెందిన ప్రియభారతి నిర్వహిస్తోంది. యానిమేటర్‌గా ఉన్న తన తల్లి మంగ సహకారంతో మహిళాశక్తి సంఘాలు చెల్లించే పొదుపు, వాయిదాల సొమ్మును ఆమె కాజేసింది. ఎన్ని రోజులైనా ఇంకా బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు మహిళాశక్తి సంఘాల సభ్యులకు చెప్పడంతో విషయం బయటపడింది. దీనిపై ఈ నెల 27న ‘మహిళాశక్తి సంఘాల సొమ్ము గోల్‌మాల్’, 30న ‘తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు’ శీర్షికలతో ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది.
తానూ తగ్గేది లేదంటున్న రజతం
పరుగు పందెంలో దూసుకుపోతున్న
బంగారం, వెండి ధరలు
సామాన్య, మధ్య తరగతి
ప్రజల్లో ఆందోళన
గతంలో కొనుగోలు చేసిన
వారిలో నిండుకున్న జోష్
నెల రోజుల్లో 10 గ్రాములకు
రూ.20 వేలు పెరుగుదల
ఉమ్మడి జిల్లాలో రోజుకు
20 కేజీల బంగారం అమ్మకాలు

శ్రీ దుర్గాదేవిగా అమ్మవార్ల దర్శనం