
అంతిమంగా నిజమే గెలుస్తుంది
మిథున్‌రెడ్డికి బెయిల్‌పై
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావడం ద్వారా ఆయనపై పెట్టిన అక్రమ కేసు కూడా వీగి పోయి ఆనక అంతిమంగా నిజమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ న్యాయం లేదు. చట్టం లేదు. ఇవే అక్రమాలతో రోజులు గడుపుతున్న కూటమి ప్రభుత్వం ఎంతోకాలం మనుగడ సాగించలేదని చెప్పారు. మిథున్‌రెడ్డిపై పోలీసులు మోపిన అక్రమ అభియోగాలు రుజువు కానంత వరకూ ఆయన నిర్ధోషేనని, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టామన్న కూటమి ప్రభుత్వ తాత్కాలిక ఆనందం త్వరలోనే ఆవిరై పోతుందన్నారు. ఆయన బెయిల్‌తో బయటకు రావడంతో చంద్రబాబు, లోకేష్‌ల ఆనందం ఇప్పటికే కొంత ఆవిరైందని ఆయన విమర్శించారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ పాల్గొన్నారు.