
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత
ముమ్మిడివరం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు భద్రపర్చిన గోదాముల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు భద్రపరిచిన గోదాములను ఆయన తనిఖీ చేశారు. తొలుత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోదాములకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, తదితర వాటిని పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్‌ను పరిశీలించి అందులో సంతకం చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు గార్డులను ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ శివరాజ్, రివెన్యూ, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారంలో
అలసత్వం వద్దు
అమలాపురం రూరల్: ప్రజల అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ నిషాంతి, డీఆర్వో మాధవి, డ్వామా పీడీ మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీలు ప్రజల నుంచి సుమారు 162 అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలన్నారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ అర్జీల పరిష్కారాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు.
మిథున్‌రెడ్డికి బెయిల్
ఇవ్వడం సముచితం
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా తప్పుడు కేసు బనాయించి 71 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచిన ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ స్వాగతించారు. సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్‌రెడ్డిని ఎమ్మెల్సీ సోమవారం కలిశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టడంపై కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా కూటమి ప్రభుత్వ తీరు మారడం లేదని ఎమ్మెల్సీ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ముందు రెడ్‌బుక్ రాజ్యాంగం పనిచేయదని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. మిథున్‌రెడ్డికి బెయిల్ రావడం ద్వారా అక్రమ కేసులు ముందు ముందు నిలబడవన్న సంకేతాన్ని ఇస్తోందని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 36 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదికకు 36 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ రాహుల్ మీనా ఫిర్యాదు పత్రాలు స్వీకరించారు. ఎస్పీ మీనా కూలంకుషంగా వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపించారు. సమస్య తీవ్రతను బట్టి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఫోన్‌లో మాట్లాడారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.

ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత

ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత

ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత