
సంపద తయారీపై అవగాహన అవసరం
సామర్లకోట: సంపద తయారీ కేంద్రాలపై ఎంపీడీఓలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని విస్తరణ శిక్షణ కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీలు ఎస్‌ఎస్ శర్మ, కె.శేషుబాబు, జగన్నాథం అన్నారు.
స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేఽడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో పదోన్నతి పొందిన ఎంపీడీఓలు ఈ నెల 8వ తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భాగంగా జి.రాగంపేటలోని వర్మీ కంపోస్టు యూనిట్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈటీసీ టెక్నికల్ ఫ్యాకల్టీ ఎస్‌కే మోహిద్దీన్, రాగంపేట పంచాయతీ కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.