సందడి చేసిన ‘అనగనగా ఒక రాజు’ | - | Sakshi
Sakshi News home page

సందడి చేసిన ‘అనగనగా ఒక రాజు’

Sep 27 2025 4:59 AM | Updated on Sep 27 2025 4:59 AM

సందడి చేసిన ‘అనగనగా ఒక రాజు’

సందడి చేసిన ‘అనగనగా ఒక రాజు’

జి.మామిడాడలో పోలిశెట్టి నవీన్‌ చిత్రం షూటింగ్‌

పెదపూడి: జి.మామిడాడలో సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. హీరో పోలిశెట్టి నవీన్‌ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా సీతార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలో అనగనగా ఒక రాజు సినిమా షూటింగ్‌ శుక్రవారం జరిగింది. ఈ సినిమాకు మారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన జాతిరత్నాలు చిత్రానికి ఆయన రైటర్‌గా పనిచేసి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మూడురోజులుగా ఎల్‌ఎన్‌పురంలో ఈ షూటింగ్‌ సాగుతోంది. జబర్దస్త్‌ ఆర్టిస్టులు చమ్మక్‌ చంద్ర, భద్రం, మహేష్‌, రోహిణీ, సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్‌గా నవీన్‌ (రాజు) ఓట్లు అభ్యర్థించే సన్నివేశాలు, ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడే సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సినీ వార్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement