
రూ.3.8 లక్షల విలువైన ఆభరణాల చోరీ
కపిలేశ్వరపురం: స్థానిక చప్పిడి శ్యామ్‌ప్రసాద్ ఇంటిలోని రూ.3.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అంగర పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు శ్యామ్ ప్రసాద్, ధనలక్ష్మి దంపతులు ఈ నెల 23న వేరే ఊరిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం రాత్రి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూశారు. బీరువా తెరిచి సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. రూ.2.5 లక్షల విలువైన 25 గ్రాముల బంగారం, రూ.1.3 లక్షల విలువైన 32 తులాలు వెండి అపహరించుకుపోయారు. బాధితులు ఫిర్యాదుపై మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, ఎస్సై జి.హరీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అమలాపురం నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.