
జీజీహెచ్‌లో 2డీ ఎకో సేవలు పునఃప్రారంభం
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో 2డీ ఎకో సేవలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఎన్‌టీఆర్ వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ వానపల్లి వరప్రసాద్ ఈ విషయం తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆదేశాల మేరకు, ఇన్‌సోర్సింగ్ విధానంలో కార్డియాలజిస్టులను ఆసుపత్రికి తీసుకొచ్చి రోగులకు 2డీ ఎకో సేవలు అందిస్తున్నామని వివరించారు. దీని ద్వారా హృద్రోగాలతో బాధపడుతున్న వారికి తొలి దశ వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. తొలి రోజు 30 మందికి 2డీ ఎకో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.