
పనులు ఆగిపోయినట్టే..
ముమ్మిడివరం మండలం గాడిలంక జెడ్పీ ఉన్నత పాఠశాలకు నాడు– నేడులో పనుల నిమిత్తం రూ.1.06 కోట్లు మంజూరు చేశారు. దీనిలో మూడు అదనపు తరగతి గదులకు సంబంధించి రూ.42 లక్షలు మంజూరు కాగా, ఇప్పటికీ పునాదుల దశ దాట లేదు. పాఠశాల మరమ్మతులు, ఇతర పనులకు కేటాయించిన రూ.24 లక్షల పనులు ఇంకా మొదలు కాలేదు. ఇంకా తరగతి గదులలో ఫ్లోరింగ్, టైల్స్ వేయాల్సి ఉంది. ఆర్వో ప్లాంట్ నిర్మాణంతోపాటు విద్యుత్ మరమ్మతులు వంటి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
అన్నీ ఇచ్చారు.. నిర్మాణం పూర్తి కాలేదు
రావులపాలెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నాడు–నేడులో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణాలకు రూ.63.98 లక్షలు కేటాయించారు. తొలి దశలో రెండు, రెండవ దశలో రెండు చొప్పున నాలుగు అదనపు తరగతులు గదులకు సంబంధించి శ్లాబ్, ఇతర పనులు చేపట్టారు. విద్యుత్ పరికరాలు ఇచ్చారు. వైరింగ్ చేయలేదు. తలుపులు, కిటికీలు అందించారు. కాని కిటికీలకు గ్రిల్స్ లేవు. రంగులు వేయలేదు. మరో రూ.పది లక్షలు ఇస్తే అన్ని పనులు పూర్తవుతాయి.
తలుపులు లేవు
ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లి ఎంపీపీఎస్ పాఠశాల అభివృద్ధికి నాడు–నేడు రెండవ దశలో రూ.36 లక్షలు కేటాయించారు. రెండు అదనపు తరగతి గదులతో పాటు ఇతర పనులకు నిధులు కేటాయించారు. ఒక గది నిర్మాణం మాత్రమే జరిగింది. రూ.పది లక్షలు మాత్రమే వచ్చాయి. నిర్మించిన గదికి గుమ్మాలు.. తలుపులు లేవు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలోనే అదనంగా బెంచీలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వంలో మాత్రం ఒక్క రూపాయి కూడా రాలేదు.

పనులు ఆగిపోయినట్టే..

పనులు ఆగిపోయినట్టే..