
29 సారా రహిత గ్రామాలు
అమలాపురం రూరల్: నవోదయం ద్వారా జిల్లాలో 8 మండలాల్లో 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నవోదయం 2.0 కార్యక్రమాల అమలపై జిల్లా స్థాయిలో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ సారా రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తొలుత ప్రోహిబిషన్ ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ వి.రేణుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నవోదయం కార్యక్రమాల ప్రగతిని అధికా రులకు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో ఆలమూరు, పి.గన్నవరం, ఆత్రేయపురం మండలాల్లో సుమారు 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామన్నారు. ప్రత్యామ్నాయ జీవనోపాధుల కోసం మూడు కుటుంబాలను గుర్తించామన్నారు. ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్‌ఓ కే మాధవి, సాంఘిక సంక్షేమ శాఖ సాధికార అధికారి పి. జ్యోతిలక్ష్మిదేవి, డీఆర్‌డీఏ పీడీ జయచంద్ర గాంధీ, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవీ. ప్రసాద్ రావు ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థికి సాయం
అమలాపురం మండలం జనుపల్లి చెందిన జాన్‌పాటి విజయ్ కుమార్ వైద్య ఖర్చులకు సహాయం అందించామని కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. అల్లవరం మండలం గోడి అంబేడ్కర్ గురుకుల కళాశాలలో విజయ్‌కుమార్ జూనియర్ ఇంటర్ బైపీసీ చదువుతూ ఈ నెల 19వ తేదీ హాస్టల్ పై భాగంలో ఆరబెట్టిన దుస్తులను తీసుకువచ్చే క్రమంలో కళ్లు తిరిగి మేడ పైనుంచి కిందికి ప్రమాదవ శాత్తు జారిపడ్డాడని తెలిపారు. విజయ్ కుమార్‌కు రూ.50,000 ఇన్సూరెన్స్ రూపంలో వైద్య ఖర్చులు మంజూరు చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందుతున్నాడన్నారు.
కలెక్టర్ మహేష్‌కుమార్