
108కు ‘పచ్చ’కామెర్లు
ఉప్పలగుప్తం: 108 వాహనాలకు ‘పచ్చ’రంగు పడింది. సాధారణంగా అంబులెన్స్‌లకు నీలం రంగు, ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు వేస్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నీలం రంగు వేసి, ఎరుపు, తెలుపు రేడియం స్టిక్కర్లు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 108 వాహనాల ముందు భాగానికి పసుపు రంగు వేసి, వాహనానికి ఇరువైపులా పసుపు రంగు బోర్డులు వేయడం గమనార్హం. వాహనాలకు రంగు మార్చేందుకు విజయవాడ తీసుకుని వెళుతున్నారు. రంగుల మార్చడానికి తోడు వాహనాన్ని విజయవాడ తీసుకుని వెళ్లడం అదనపు ఖర్చు. ఒక అంబులెన్స్ వెళ్లి రంగు మార్చుకొని రావడానికి పది నుంచి పదిహేను రోజులు పడుతోంది. ఈ సమయంలో స్థానికులకు ఎటువంటి ప్రమాదం జరిగినా సకాలంలో 108 అంబులెన్స్‌లు రావడం లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ పార్టీ రంగులను పోలి ఉంటే చాలు పార్టీ రంగులు వేశారని నానా హంగామా చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఇప్పుడు పచ్చరంగు వేయడంపై మాత్రం నోరు మెడపకపోవడం విమర్శలకు దారితీస్తోంది.