
కాలువలు లేక.. నీరు ముందుకు కదలక
చిత్తూరు అర్బన్: నగరంలోని సీఎంటీ రోడ్డులో మురుగు కాలువలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడితే సీఎంటీ రోడ్డులో వర్షపు నీరంతా రోడ్డుపై నిలిచిపోతోంది. కాలువలు లేకపోవడం, రోడ్డు ఆక్రమణకు గురవడంతో ఈ పరిస్థితి తతెత్తింది. నిత్యం ఇటువైపు వందలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వర్షం పడినప్పుడల్లా నీళ్లు రోడ్లపై, నివాసాల మధ్య నిలిచిపోతోంది. అటు వాహన చోదకులు, పాదచారులతో పాటు స్థానిక ప్రజలకు ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది. పాలకులు పట్టించుకుని సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.