
కార్యకర్తల బలోపేతమే లక్ష్యం
పుంగనూరు: పార్టీ కార్యకర్తల బలోపేతానికి కృషి చేస్తామని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విభాగాలతో సమన్వయం చేస్తూ పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు పటిష్ట ప్రణాళికలు చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, వివిధ మండలాలకు చెందిన వార్డు ఇన్‌చార్జ్‌లు, గ్రామ ఇన్‌చార్జులతో సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల వారీగా, గ్రామాల వారీగా నియమించిన ఇన్‌చార్జ్‌లకు పలు సూచనలు, సలహాలు అందించారు. పార్టీ విషయాలతో పాటు కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, అరాచకాలు, అక్రమాలపై ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోని అందరితో ఒకేసారి చర్చించేలా టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీకి కార్యకర్తలే మూలాధారమని, వారిని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతామన్నారు. తొలిసారిగా పుంగనూరు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కార్యకర్తలు అందరూ సైనికులవలే పని చేస్తూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కష్టపడాలని కోరారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఐటీ వింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, విరూపాక్షి, జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషాతో పాటు ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు, నూతన కమిటీల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.