
మాజీ సైనికుడు బాజీబాబాకు ఘనంగా నివాళులు
నిజాంపట్నం: మాజీ సైనికుడు షేక్ బాజీబాబా విశాఖపట్టణం జిల్లా భీమిలిలో అకాల మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన నిజాంపట్నం మండలం బావాజీపాలేనికి తీసుకువచ్చారు. సోమవారం నిర్వహించిన అంతిమ యాత్రలో పలువురు సైనికులు, మాజీ సైనికులు, గ్రామస్తులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, జిల్లా సైనిక్ వెల్పేర్ కార్యాలయ అధికారి మునిపల్లె శ్రీనివాసరావు, అసోసియేషన్ ట్రెజరర్ నిజాముద్దీన్, నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్ మెహబూబ్, బాపట్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, పొన్నూరు అసోసియేషన్ సెక్రటరీ మాసుం అలీ, మాజీ సైనికులు షేక్ అల్లావుద్దీన్, తాడివాక రుక్మధరరావు, చినమట్లపూడి, బావాజీపాలెం, పరిసర ప్రాంతాల మాజీ సైనికులు పాల్గొన్నారు.
అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ సైనికులు