రైతుకు విపత్తి | - | Sakshi
Sakshi News home page

రైతుకు విపత్తి

Oct 5 2025 4:54 AM | Updated on Oct 5 2025 4:54 AM

రైతుకు విపత్తి

రైతుకు విపత్తి

రైతుకు విపత్తి

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నూనె గణపతికి ఎకరం భూమి ఉంది. మూడు నెలల కిందట మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు, పై ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు కూడా పొలంలో రోజుల తరబడి నిలబడటంతో ఉరకెత్తి ఎర్ర తెగులు సోకింది. గులాబీ రంగు పురుగు కూడా పంటను తీవ్రంగా ఆశించింది. మూడు నెలలైనా రెండడుగులు కూడా పెరగలేదు. కౌలుకు రూ. లక్ష, వ్యవసాయం చేసేందుకు సుమారు మరో రూ.లక్ష వరకు పెట్టుబడులు అయ్యాయి. గుండె తరుక్కుపోయిన గణపతి పొలంపై ఆశలు వదులుకున్నాడు. కన్నబిడ్డలా సాగు చేసిన పైరును తన చేతులతోనే పీకేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement