సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు

Oct 4 2025 6:40 AM | Updated on Oct 4 2025 6:40 AM

సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు

సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు

సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు

బాపట్ల: సమాజానికి మార్గదర్శకులుగా ఉపాధ్యాయులు ఉండాలని జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక బాపట్ల ఫార్మసీ కాలేజీలో డీఎస్సీ 2025 లో ఎంపికై న ఉపాధ్యాయులకు ఎనిమిది రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాబోయే రెండు తరాల పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయలుగా ప్రయాణం ప్రారంభించి న మీరు ముందు శిక్షణ తీసుకొని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. తాను చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయులను ఇప్పటికే నేను మర్చిపోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిల్లలు గురువు స్థానాన్ని ఎన్నటికీ మర్చిపోలేరని ఆయన చెప్పారు. నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులు మిమ్ములను తీర్చిదిద్దుకుని పవిత్రంగా ఉద్యోగం చేయాలని అని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని కోరారు. బాపట్ల జిల్లాకు డీఎస్సీ ద్వారా 485 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడ్డారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సార్వ శిక్ష అభియాన్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు.

ఎయిడ్స్‌వ్యాధిపై విస్తృత ప్రచారం చేపట్టాలి

బాపట్ల: జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధిపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆరోగ్య ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరికీ ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన వైద్య పరీక్షలు చేయించుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ పాల్గొన్నారు.

క్యారవాన్‌ బస్సుతో ప్రత్యేక అనుభూతి

బాపట్ల: జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో క్యారవాన్‌ బస్సును పరిశీ లించారు. పర్యాటక అభివృద్ధి దిశగా క్యారవాన్‌ టూరిజం రాబోయే రోజుల్లో నూతన వరవడిని చూపుతుందని అన్నారు. జిల్లాలో క్యారవాన్‌ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. క్యారవాన్‌ బస్‌ సౌకర్యాలను జిల్లా కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. క్యారవాన్‌ వాహనాన్ని సూర్యులంక బీచ్‌లో పర్యాటకుల సందర్శన కోసం శని, ఆదివారాలలో ఉంచుతామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నాగిరెడ్డి, టూరిజం శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement