
ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఇస్సాక్
బాపట్ల: ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జి.ఇస్సాక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా ఎన్నికలను ఎన్నికల అధికారిగా సిహెచ్.శేషుబాబు వ్యవహరించారు. ఎన్నికల్లో జి.ఇస్సాక్, డి.రాజేష్ తరఫున 18 మంది నామినేషన్లు వేశారు. వీరిలో జి.ఇస్సాక్‌కు సంబంధించిన ప్యానల్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. సహాయ ఎన్నికల అధికారులుగా కె.సాంబశివరావు, కె. కిరణ్ కుమార్, ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా చైర్మన్ పి.నాగేశ్వరరావు, కన్వీనర్ బి.ప్రసాద్‌రావు హాజరై కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
జిల్లా అధ్యక్షుడు ఏకగ్రీవం
జిల్లా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులుగా జి.ఇస్సాక్, గౌరవ అధ్యక్షులు యు.నరసింహారావు, ఉపాధ్యక్షులుగా పి.సంధ్యారాణి, ఎ.జాషువా, షేక్.ఎం.సుభానీ, పి.అన్వేషన్, వై.శ్రీనివాసరావు, కార్యదర్శులుగా బి.రాజేష్, జాయింట్ సెక్రటరీలుగా చంద్రకాంత్, నాగూర్‌షరీఫ్, ఎం.శ్రీనివాసరావు, పి.వి.నవీన్, శ్యామ్యూల్‌రాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శేషగిరిరావు, జాయింట్‌సెక్రటరీ వై.సృజనకుమారి, ట్రెజరర్ ఖాదర్‌బాషా, కో ఆప్షన్ సభ్యులు కె.పవన్‌వెంకట కుమార్, రత్నశేఖర్‌లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.