
గ్రానైట్ లారీల రాకపోకలపై ఆగ్రహం
బల్లికురవ: రహదారి సక్రమంగా లేనందున అభివృద్ధి పరిచే వరకు గ్రానైట్ లారీల రాకపోకలను నిషేధిస్తున్నట్లు బుధవారం సాయంత్రం నక్కబొక్కలపాడు గ్రామస్తులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. బల్లికురవ–మార్టూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు బల్లికురవ, నక్కబొక్కలపాడు, నాగరాజుపల్లి గ్రామాల మధ్య 6 కిలోమీటర్ల మేర గొతులతో అధ్వాన స్థితికి చేరింది. ఈ గోతుల్లో గ్రానైట్ లారీలు కూరుకుని రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నక్కబొక్కలపాడు, పల్లె సమీపంలో గ్రానైట్ లారీ రోడ్డుపై కూరుకుని గంటన్నరపాటు ట్రాఫిక్ జాంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. గోతులు, దుమ్ము ప్రభావంతో అనారోగ్యం బారిన పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించకోవటం లేదని గ్రామస్తులు వాపోయారు. రోడ్డు పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచే వరకు గ్రానైట్ లారీల రాకపోకలను నిషేధిస్తున్నట్లు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు
నాదెండ్ల: సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నిజమని తేలటంతో సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 2017–18లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు రూ.40 లక్షల పంచాయతీరాజ్ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ 2020లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించారు. అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా వ్యవహరించిన కేశవరావుకు చార్జ్‌మెమో జారీ చేశారు. కాంట్రాక్టర్‌కు చెల్లించిన బిల్లులో కోత విధించారు. 2024లో కేశవరావు ఉద్యోగ విరమణ చేశారు. తాజాగా కేశవరావుపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పింఛను నుంచి మూడేళ్లపాటు 15 శాతం చొప్పున జరిమానాగా కోత విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గ్రానైట్ లారీల రాకపోకలపై ఆగ్రహం