
ముంపు ప్రాంతాలలో డాక్టర్ గణేష్ పర్యటన
రేపల్లె: వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుండాలని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ కోరారు. కృష్ణానది వరద ముంపు గ్రామాలను బుధవారం ఆయన సందర్శించారు. లంకెవానిదిబ్బ, పెనుమూడి గ్రామాలలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పట్టణ, రూరల్, చెరుకుపల్లి కన్వీనర్‌లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, డుండి వెంకట రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిమటా బాలాజీ, నాయకులు ఉమాదేవి, చౌటు రమేష్, శొంఠి సురేష్, నాగేశ్వరరావు, సుబ్బారావు, నాగబాబు, వీరనారాయణ, గోపి, తోట శివ, ఖాదర్, ఖాదర్‌వలి, అబ్దుల్ ఖుద్దూష్ తదితరులున్నారు.