
ఇంకా జల దిగ్బంధంలోనే..
వరద తీవ్రత కాసత్త తగ్గినప్పటికీ లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు తొలగలేదు. మండలంలోని సుగ్గునలంక, దోనేపూడి చప్టాల పైనుంచి, ఆవులవారిపాలెం – గాజుల్లంక, పోతార్లంక – గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు కరకట్ట దిగువున రోడ్లపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. లంక గ్రామాలు మూడు రోజులుగా చుట్టుముట్టిన వరద నీటి మధ్యనే చిక్కుకొని ఉన్నాయి. సుగ్గునలంక, దోనేపూడి, భట్టిప్రోలు మండలం వెల్లటూరు వద్ద అందుబాటులో ఉంచిన పడవలను అత్యవసర పనుల కోసం ప్రజలు వినియోగించుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. మండంలోని పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, తురకపాలెం, కిష్కిందపాలెం, తడికలపూడి, గుంటూరుగూడెం, మధ్యగూడెం, జువ్వలపాలెం, శివరామపురం, రావిలంక, గాజుల్లంక వరదలో చిక్కుకున్నాయి.