
అర్జీలను వెంటనే పరిష్కరించండి
బాపట్ల: ప్రజలు తమ సమస్యలపై ప్రజా సమస్యల పరిస్కార వేదికలో అందజేసిన అర్జీలను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, పలువురు జిల్లా అధికారులతో అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజునే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో పింఛన్ తీసుకోలేకపోతే కారణాలు గుర్తించాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో, ఆర్డీఓలు, ప్రతి మండల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా 28 కల్లా అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యంతోపాటుగా మిగిలిన వస్తువులు పంపిణీ చేయాలన్నారు. రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిషేధిత జాబితా, 22ఏకి సంబంధించి ప్రతి శుక్రవారం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ఫైల్స్‌ను పరిష్కరిస్తామన్నారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి (ఏఓ) మల్లి కార్జునరావు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ లవన్న, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాదవి, డీఎఫ్‌ఓ రవిశంకర్, డీపీఓ ప్రభాకరరావు, సీపీఓ ఏ.ఎస్.రాజు, డీఈఓ పురుషోత్తం, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్