
దళిత నాయకుల నినాదాలు..
ఈ సందర్భంగా సమావేశంలో ఒకానొదశలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించి లాఠీచార్జికి పాల్పడిన సీఐను సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నాయకులు చార్వాక, నీలం నాగేంద్రరావు తదితరులు నినాదాలు చేశారు. డేగరమూడి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలపై అధికారులు విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రామాంజనేయులు జోక్యం చేసుకొని దళిత నాయకులను శాంతపరిచారు. గ్రామాల్లోని ఇరువర్గాలు అంబేడ్కర్ విగ్రహ స్థాపన కోసం కమిటీ వేసుకొని అనుమతులు వచ్చాక ప్రశాంత వాతావరణంలో విగ్రహ స్థాపన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి. ప్రశాంతి, సీఐ శేషగిరి, డేగర మూడి గ్రామప్రజలు, నాయకులు వైఎస్సార్ సీపీ మార్టూరు మండల కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.