
8వ రౌండ్‌కు చేరిన జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ఆసక్తికరంగా జరిగాయి. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి, పీఎస్‌పీబీకి చెందిన నాలుగు సార్లు జాతీయ విజేత జీఎం కృష్ణన్ శశికిరణ్ తన జట్టు సహచరుడు జీఎం దీప్‌సెం గుప్తాపై గెలిచాడు. అదే జట్టుకు చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అభిజీత్ గుప్తా యూపీకి చెందిన ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిపై విజయం సాధించారు. దీంతో శశికిరణ్, అభిజీత్‌లు చెరో ఏడు పాయింట్లతో టాప్‌లో నిలిచారు. వీరికి సగం పాయింట్ వెనుక ఆరుగురు ఆటగాళ్లు (తమిళనాడు జీఎం ఇనియన్, రైల్వేస్ జీఎం దీపన్ చక్రవర్తి, నలుగురు ఐఎంలు) ఉన్నారు.