
ఆర్డీ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్‌గా పాల్ సుధాకర్
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్‌గా (డీడీ) బండి పాల్ సుధాకర్‌ను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి ద్వారా డీడీగా విధుల్లో చేరనున్నారు. కడపకు చెందిన పాల్ సుధాకర్ హాకీ క్రీడలో ప్రతిభ చాటారు. పలుమార్లు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్పోర్ట్స్ కోటాలో 1993లో సీనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై , డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆఫీస్ సూపరింటెండెంట్‌గా, పరిపాలనా అధికారిగా పదోన్నతులు పొంది 2014 వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పని చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ పొంది గుంటూరు జీజీహెచ్‌కు 2015లో బదిలీ అయ్యారు.