తప్పిపోయిన పాప తల్లిదండ్రుల చెంతకు | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన పాప తల్లిదండ్రుల చెంతకు

Sep 30 2025 7:39 AM | Updated on Sep 30 2025 7:39 AM

తప్పిపోయిన పాప తల్లిదండ్రుల చెంతకు

తప్పిపోయిన పాప తల్లిదండ్రుల చెంతకు

తప్పిపోయిన పాప తల్లిదండ్రుల చెంతకు మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను మోసం చేసిన యువకుడు ప్రజలకు తగ్గనున్న వైద్య ఖర్చులు చట్టాలపై వృద్ధులకు అవగాహన

చీరాల అర్బన్‌: తప్పిపోయిన పాపను చీరాల ఒన్‌టౌన్‌ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఒన్‌టౌన్‌ సీఐ ఎస్‌.సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు జె.పంగులూరు మండలానికి చెందిన నాలుగు సంవత్సరాల పాప ఆరాధ్య చీరాల ఎంజీసీ మార్కెట్‌ వద్ద సోమవారం తప్పిపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన సిబ్బందిని, శక్తి టీం సభ్యులను అప్రమత్తం చేశారు. గంట వ్యవధిలోనే పాపను గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. తమ పాపను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

జె పంగులూరు: మద్యం తాగి బైక్‌ మీద వస్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని ముప్పవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సర్వీసు రోడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముప్పవరం గ్రామంలో జాతీయ రహదారిపై చిలకలూరిపేట వైపు వెళుతున్న సర్వీస్‌ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళుతూ సైడ్‌ డివైడర్‌ని ఢీకొన్నారు. మద్యం తాగి ఉండటం వల్ల అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన ఒక వ్యక్తి తలకు గట్టి దెబ్బ తగిలి ప్రమాద స్థలంలోనే మృతిచెందాడు. మరో వ్యక్తికి బలమైన గాయాలు అవటంతో అతన్ని అంబులెన్స్‌లో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే అంబులెన్స్‌ సిబ్బంది తెలిపారు. వీరి వివరాలు తెలియరాలేదు. రేణింగవరం ఎస్సై వినోద్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యర్రబాలెం(మంగళగిరి): ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను మోసం చేసిన ఘటన యర్రబాలెం బీసీ కాలనీలో జరిగింది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని యర్రబాలెం బీసీ కాలనీకి చెందిన మైనర్‌ బాలిక అదే ప్రాంతానికి చెందిన సందీప్‌ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యలో బాలికను వివాహం చేసుకోవాలని కుటుంబసభ్యులు కోరగా నిరాకరించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

గుంటూరు మెడికల్‌: అత్యవసర మందులు, వైద్య పరికరాలపై ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించడం వల్ల ప్రజలకు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా శిశువులకు ఉపయోగించే న్యాప్కిన్లు, ఫీడింగ్‌ బాటిల్స్‌, వ్యక్తిగత ఆరోగ్య బీమా అంశాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపును ఇచ్చారని పేర్కొన్నారు. క్యాన్సర్‌ కారకమైన పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 నుంచి 40 శాతానికి పెంచడం వల్ల వినియోగం తగ్గుతుందన్నారు. తద్వారా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు. వైద్యశాఖ అధికారులు, వైద్యులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

గుంటూరు లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు, క్యాలెండరు యాక్టివిటీస్‌లో భాగంగా అక్టోబర్‌ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా న్యాయ విజ్ఞాన సంస్థలో సదస్సు నిర్వహించారు. ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.కుముదిని సదస్సును ప్రారంభించారు. వృద్ధులకు న్యాయపరంగా ఉన్న సెక్షన్లు, హక్కులు, పిల్లల ద్వారా మోసపోయిన వారికి తిరిగి ఆస్తిని పొందే చట్టాల గురించి ఆమె వివరించారు. వృద్ధులు ఎదుర్కొనే పలు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి స్టేట్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసి యేషన్‌ సెక్రటరీ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. సీహెచ్‌.పరమేశ్వరరావు, పారా లీగల్‌ వలంటీర్స్‌, వృద్ధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement